2014లో తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు అప్పట్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసు ఇప్పటికీ జగన్ ను వెంటాడుతోంది. నాంపల్లి కోర్టు సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం జగన్ కు సమన్లు పంపింది. దీంతో తెలంగాణ హైకోర్టులో ఈ కేసు కొట్టివేయాలని జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. ఈ కేసులో జగన్ వ్యక్తిగత హాజరుపై ఏప్రిల్ 26 వరకు స్టే విధించింది.