తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ శివారులోని బోయివాడలో ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించి, 11 మంది సజీవదహనం అయ్యారు. గోడౌన్ కూడా పూర్తిగా కాలిపోయింది. అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు హోం మంత్రి అధికారులతో కలిసి వెళ్లారు. ఆ సందర్భంలోనే పెద్ద ప్రమాదం తప్పింది. హోం మంత్రి పరిశీలించి ఇలా బయటకు రాగానే కాలిపోయి ఉన్న గోడ ఒకటి కూలింది. ఆ గోడ కొంచెం ముందు కూలి ఉంటే హోం మంత్రికి పెను ప్రమాదమే జరిగేది. హోం మంత్రి సేఫ్ గా బయటపడడంతో హమ్మయ్యా అని అందరూ ఊపిరిపీల్చుకున్నారు.