బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై టీబీజేపీ అధ్యక్షుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, జీహెచ్ఎంసీ మహిళా కార్పోరేటర్లు రాజ్‌భవన్ వద్ద ధర్నా చేపట్టారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో వారు రాజ్‌భవన్ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా వారందరూ నినాదాలు చేశారు. దీంతో మేయర్ విజయలక్ష్మీ, కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.