తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను పాలిసెట్ (TS Polycet) నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల రెండో వారంలో ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. జూన్ 4 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రూ.100 ఫైన్ తో జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఈ పరీక్షకు పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జూన్ 30న ఈ పరీక్షను నిర్వహించున్నారు. పరీక్ష జరిగిన 12రోజులకు ఫలితాలు విడుదలవుతాయి.