ఈనెల 23 నుంచి తెలంగాణలో ఇంటర్ ప్రాక్టీకల్స్ నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రాక్టీకల్స్ జరుగనున్నాయి. అలాగే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు 15 నిమిషాలు లోపు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఉన్నతాధికారులు పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లకు సూచించారు.