ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకొస్తుంది. ఈ నిబంధన కొత్తగా నియామకమయ్యే వైద్యులకు మాత్రమే వర్తిస్తుందని, పాత వారికి వర్తించదని అధికారులు తెలుపుతున్నారు. అలాగే నిమ్స్ తరహాలో వేతనాలు అందించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రం సీఎం దగ్గర ఉందని, అతను సంతకం పెడితే నిబంధనలు అమలులోకి వస్తాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో 12,755 పోస్టులను భర్తీ చేయనున్నారు.