తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈనెల 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా ఇంటర్ ఫైనల్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.