TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రధాన నిందుతుడు ప్రవీణ్‌పై పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో మొత్తం ఐదు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. గ్రూప్ 1, ఏఈఈ, డీవోఈ ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిసింది. మరో రెండు పేపర్ల లీకేజీ గురించి అధికారులు తెలపాల్సి ఉంది. పరీక్షల్లో ర్యాంకులు సాధించిన నిరుద్యోగులు ప్రశ్నాపత్రాల లీకేజీపై ఆందోళన చెందుతున్నారు.