టీఎస్పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని జారీ చేసింది. రాష్ట్రంలోని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 16 నుంచి జనవరి 5 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం https://www.tspsc.gov.in/ వెబ్సైట్ని సంప్రదించాలని తెలిపింది. ఇటీవల 9వేలకు పైగా గ్రూప్ 4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.