తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)లో వన్ టైమ్ రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలు ఎడిట్ చేసుకునేందుకు బోర్డు అవకాశం కల్పించింది. తాజాగా ఏర్పడిన 33 జిల్లాల ప్రకారం తమ వివరాలు నమోదు చేసుకోవాలని TSPSC కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. అలాగే కొత్త అభ్యర్థులు కూడ రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అఫిషియల్ వెబ్సైట్లో ఎడిట్ ఫారం అందుబాటులో ఉంటుందని వివరించారు.