తెలంగాణలో TSRTC సంస్థ ఆదాయం పెంచుకునేందుకు పలు రకాల ప్రయత్నాలను చేస్తోంది. తాజాగా TSRTC బస్సుల్లో తిరుమలకు వెళ్లే భక్తులకు రూ.300 దర్శనం టిక్కెట్లు ఇస్తామని TTD ప్రకటించింది. ప్రతి రోజు 1000 మందికి ఈ అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఛైర్మన్ బాజిరెడ్డి ఈ మేరకు టీటీడీతో ఒప్పందం చేసుకున్న్నారు. అయితే 2 రోజుల ముందు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరోవైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాలని టీటీడీ స్పష్టం చేసింది.