తెలంగాణలో ఇటీవలే విద్యుత్ ఛార్జీలు పెంచారు. అంతకుముందు బస్సు ఛార్జీలు పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచుతున్నట్లు TSRTC నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. కాగా ఈ పెంపు నుంచి స్టూడెంట్ బస్ పాస్ ధరలను మినహాయించడం విశేషం. కాగా, పెంచిన ధరల ప్రకారం.. టీఎస్ఆర్టీసీ ఆర్డినరీ బస్ పాస్ రూ.950 నుంచి రూ.1150కి, ఎక్స్ప్రెస్ రూ.1070 నుంచి రూ.1300, డీలక్స్ రూ.1185 నుంచి రూ.1450, ఏసీ బస్సు రూ.2500 నుంచి రూ.3000లుగా ఉండనున్నాయి. ఇక, ఎన్జీవో ఆర్డినరీ రూ.320 నుంచి రూ.400లకు, ఎన్జీవో మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ రూ.450 నుంచి రూ.550కి, అలాగే ఎన్జీవో డీలక్స్ పాస్ రూ.575 నుంచి 700 లుగా నిర్ణయించారు.