డ్రింకింగ్ వాటర్ వ్యాపారంలోకి తెలంగాణ ఆర్టీసీ అడుగు పెట్టనుంది. జీవ అనే పేరుతో స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అనే ట్యాగ్ లైన్‌తో మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఎంజీబీఎస్‌లో వాటర్ బాటిళ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ విడుదల చేస్తారు. మెుదట 1 లీటర్ బాటిళ్లను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. త్వరలో కార్యాలయాల్లో వినియోగించేందుకు 250ml, ఏసీ బస్సు ప్రయాణికులకు అరలీటర్ ఉత్పత్తి చేయనుంది. దశలవారీగా తెలంగాణ అంతటా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.