పది రోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మూడోసారి టిక్కెట్ ఛార్జీలను పెంచింది. సౌకర్యాల సెస్ కింద ఛార్జీలను పెంచుతున్నట్లు సోమావారం తెలిపింది. ఎక్స్‌ప్రెస్ , డీలక్స్ బస్సు సర్వీసులకు టిక్కెట్ ధర రూ.1 నుంచి రూ.5కి పెంచగా, రాజధాని, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల వంటి అత్యాధునిక సర్వీసులకు రూ.1 నుంచి రూ.10కి పెరిగాయి. బస్సులు, బస్టాప్‌ల నిర్వహణ కోసం ఈ సెస్ విధిస్తున్నట్లు వెల్లడించింది. స్పేర్లు, ట్యూబ్‌లు, టైర్లు, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెంపు అనివార్యమని కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. సగటు రోజువారీ ఆదాయం రూ.12 కోట్లు దాటకపోయినా డీజిల్, ఇతర అవసరాలకు రోజుకు రూ.16 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని చెప్తున్నారు. టిక్కెట్ ధరలతో పాటు ఇటీవల బస్ పాస్ ధరలను కూడా ఆర్టీసీ పెంచిన సంగతి తెలిసిందే. ఈ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు.