టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి మరోమారు తన గొప్ప మనసును చాటుకున్నారు. తిరుమల నుంచి తిరుపతికి కారులో వస్తున్న సుబ్బారెడ్డికి కాలినడకన వెళ్తున్న భక్తులు కనిపించారు. చెప్పులు లేకపోవడంతో వారి కాళ్లు కాలడం చూసిన ఆయన, కారు దిగి వెళ్లి వారితో మాట్లాడారు. వారి బాధలను గురించి అడిగి తెలుసుకున్నారు. మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడి మలుపు వరకు వెంటనే గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయించాలని, అంతే కాకుండా మ్యాట్ మీద నీరు చల్లేలా కూడా ఏర్పాట్లు చేయాలని చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావును ఆదేశించారు. 24 గంటల్లో పని పూర్తికావాలన్నారు. టీటీడీ అధికారులు హుటాహుటిన గ్రీన్ మ్యాట్ ఏర్పటు చేసి నీటిని చల్లేలా ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.