రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టర్కీ చొరవ తీసుకొని రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, దిమిత్రో కులేబాలతో సమావేశం నిర్వహించనుంది. దక్షిణ టర్కీలో గురువారం వీరిద్దరి భేటీ ఉంటుందని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కావుసోగ్లు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.