వరుస ప్రకృతి విలయాలు టర్కీకి శాపంగా మారాయి. ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కి ఈ ఘటనలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున మళ్ళీ అధికారంలోకి రావాలని ఎర్డోగన్ పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలో వరుసగా భూకంపం, వరదలు రావడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. భూకంపం వల్ల దాదాపు 48వేల మందికి పైగా మృతి చెందారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం వీరికి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ తరుణంలో వరదలు ముంచెత్తడంతో ఎర్డోగన్ కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది.