ట్విటర్ లో ఎలాన్ మస్క్ సంస్కరణలు చేపడుతున్నారు. బ్లూటిక్ విధానాన్ని తిరిగి లాంఛ్ చేయనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 29న ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల కొద్దిగా ఆలస్యమవుతుందన్నారు. అంతకముందు రాజకీయ నాయకులు, ప్రముఖులు, పాత్రికేయులకు బ్లూటిక్ ఉండేది. కానీ, ఇప్పుడు ఎవరైనా డబ్బులు చెల్లించి తీసుకోవచ్చు. ట్విటర్ ఆదాయం పెంచుకునేందుకు మస్క్ ఇలా చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్విటర్ బ్లూటిక్ రీలాంఛ్ ఎప్పుడంటే !
