సెప్టెంబర్ 21 నుంచి ట్విట్టర్ ఎడిట్ ఫీచర్!

© File Photo

ట్విట్టర్ నుంచి ఎడిట్ బటన్ ఫీచర్ సెప్టెంబర్ 21 నుంచి యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్, ట్వీట్ చేసిన 30 నిమిషాల్లోపు ట్వీట్‌లో మార్పులు చేసేందుకు యూజర్లకు 5 సార్లు అనుమతిస్తుందని అంటున్నారు. కానీ ఈ కొత్త ఫీచర్‌ని అంతర్గతంగా పరీక్షించడం కోసం రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఈ క్రమంలో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు ఎడిట్ బటన్‌ను క్రమంగా విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ సేవ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, USలో మాత్రమే అందుబాటులో ఉంది.

Exit mobile version