ట్విట్టర్లో బ్లూ టిక్ సర్వీస్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకోక ముందు సెలబ్రిటీలు, జర్నలిస్ట్‌లు ఇతర ప్రముఖ సంస్థలకు బ్లూటిక్ ఇచ్చేవారు. ఇటీవల నెలకు 8 డాలర్లు చెల్లిస్తే బ్లూటిక్ పొందే సౌలభ్యాన్ని ఎలాన్ మస్క్ మొదలుపెట్టారు. అంటే 8 డాలర్లు చెల్లించగలిగే ఎవరికైనా బ్లూటిక్ వస్తుంది. దీంతో ఒక్కసారిగా ఫేక్ అకౌంట్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. ఆ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వస్తున్న ప్రకటనలతో గందరగోళం మొదలైంది. దీంతో ప్రస్తుతానికి ట్విట్టర్ ఈ సర్వీస్‌ను ఆపేసినట్లు తెలుస్తోంది.
బ్లూటిక్ సర్వీస్‌ను నిలిపివేసిన ట్విట్టర్
