దేశీ ట్విట్టర్‌గా పేరొందని KOO ప్లాట్‌ఫాంకు చెందిన ఖాతాపై ట్విట్టర్ వేటు వేసింది. @kooeminence ఖాతాను శక్రవారం నిలిపివేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు జర్నలిస్ట్ ఖాతాలను సస్పెండ్ చేసిన క్రమంలో ఈ నిర్ణయం కూడా తీసుకుంది. KOO యూజర్ల సందేహాలు నివృత్తి చేసేందుకు కొద్ది రోజుల క్రితమే @kooeminence పేరుతో ఖాతా తెరిచారు. అంతలోనే ఖాతాను నిలిపివేయడంపై ‘కూ’ సహ వ్యవస్థాపకుడు మయాంక్ అసహనం వ్యక్తం చేశారు.