నిజామాబాద్ లో పదో తరగతి చదువుతున్నబాలికను ఇద్దరు బాలురు బెదిరిస్తూ కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలో బాలికతోపాటు అదే అపార్టుమెంటులో ఉండే యువకుడు ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఆడుకుందామంటూ మేడపైకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. వాటిని వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అదే బాలికకు ఇన్ స్టాగ్రాంలో పరిచయమైన మరో యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత అతడూ వీడియోలతో బెదిరిస్తూ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అక్క పెళ్లి ఉందని వేధింపులు భరించిన బాలిక…చివరికి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.