న్యూజిలాండ్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ ద్వయం అరుదైన ఘనత సాధించారు. ఒకే ఇన్నింగ్స్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసి తొలిసారి ఈ రికార్డు సాధించిన ప్లేయర్లుగా రికార్డులకెక్కారు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ తొలి ఇన్నింగ్స్ 580-4 వద్దు వద్ద డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్ (296 బంతుల్లో 215; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెన్రీ నికోల్స్ (240 బంతుల్లో 200 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) ద్విశతకాలతో చెలరేగారు.41 సెంచరీలు చేసిన విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచారు.