ఒకే రోజు రెండు ట్రైనింగ్ విమానాలు వేర్వేరు ప్రమాదాలకు గురై కూలిపోయాయి. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు మార్చి 16వ తేదీన అన్ని ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ (FTOs)తో ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీసీఏ చీఫ్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని FTOల పూర్తి భద్రతపై తాము ఆడిట్ నిర్వహిస్తామని, విమానాలు, పైలట్ల భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడమని తెలిపారు. భద్రత విషయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.