దిల్లీలో కారు బీభత్సం కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. కారు యజమాని అశుతోష్ ఒకరైతే, మరొకరిని అంకుశ్గా పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో వీరి ప్రమేయం ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. నేరాన్ని కప్పిపుచ్చడానికి వీరు ప్రయత్నించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. దీంతో వీరిని త్వరగానే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇదివరకు ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కారు కింద చిక్కుకున్న 20 ఏళ్ల యువతిని 13కిలోమీటర్ల దూరం పాటు ఈడ్చుకెళ్లిన సంగతి తెలిసిందే.