ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ తాజాగా రెండు కొత్త మోడల్ ఫోన్లను తీసుకువచ్చింది. నోట్ సిరీస్ లో పాపులర్ అయిన రెడ్ మీ నోట్ 11 ప్రో, రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్ ఇటీవల భారతీయ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. నోట్ 11 ప్రో మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 5జీ ప్రాసెసర్, 5000 mah బ్యాటరీ ఉండగా.. 108,8,2 కెమెరాలు ఉన్నాయి. ఇక, ఈ ఫోన్ ధర 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.20,999గా ఉంటే.. 8జీబీ+128జీబీ వేరియంట్ కు రూ.22,999గా, 8జీబీ+256 వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. రెడ్ మీ నోట్ 11 ప్రో ఫీచర్లు సైతం 11ప్రో ప్లస్ కు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. కాగా, మార్చి 15 నుంచి రిలయన్స్ డిజిటల్, అమెజాన్ లలో ఈ మోడళ్లు అందుబాటులో ఉండనున్నాయి.