ఒడిశాలో పండగపూట విషాదం జరిగింది. కటక్‌లోని గోపినాథ్‌పురం టీ బ్రిడ్జ్‌పైన జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు చనిపోయారు. మరో 10 మంది మహిళలు, చిన్నారుల సహా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగనాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు బ్రిడ్జిపైకి చేరుకోవటంతో తొక్కిసలాట జరిగింది. ఊహించని స్థాయిలో భక్తులు రావటంతో పరిస్థితి అదుపుతప్పిందని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.