దేశంలో హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఇద్దరు మృతిచెందారు. కర్ణాటక, హర్యానాలో ఈ మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 90కు పైగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఆలూరుకు చెందిన 82ఏళ్ల వృద్ధుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ మార్చి 1న మృతిచెందాడు. అయితే, హెచ్3ఎన్2 వైరస్ వల్లే ఈ మరణం సంభవించిందని వైద్యులు ధ్రువీకరించారు. దేశంలో ఈ ఫ్లూ వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.