కౌషిక్ చనిపోయే రెండు వారాల ముందే విక్రమ్‌ ఫోన్ చేసి ప్రశంస

ప్రముఖ మూవీ క్రిటిక్‌ కౌషిక్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. అనేక మంది సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. అయితే తమిళ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్‌, కౌషిక్‌ చనిపోయే రెండు వారాల ముందే ఫోన్‌ చేశారాట. సినిమాల కోసం ట్విట్టర్‌లో కౌషిక్‌ చేస్తున్న మంచి పనులను మెచ్చుకున్నారట. ఆ ఫోన్‌ కాల్‌తో కౌషిక్‌ చాలా ఉప్పొంగిపోయి ఎంతో ఆనందపడ్డాడట. ఈ విషయాలను మరో సినీ ఇండస్ట్రీ ట్రాకర్‌ రమేశ్‌ బాలా ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. విక్రమ్‌కు రమేశ్‌ బాలా కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version