చాక్లెట్ ట్యాంక్‌లో పడిన ఇద్దరు కార్మికులు..ఏమైందంటే

Screengrab Twitter:

మీరెప్పుడైనా చాక్లెట్ ట్యాంకులో కార్మికులు పడిన ఘటనలు విన్నారా. అవును మీరు విన్నది నిజమే. అమెరికాలో ఇటీవల ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు పెద్ద చాక్లెట్ ట్యాంకులో పడిపోయారు. చాక్లెట్ వారి నడుము వరకు చేరుకుందని తెలుసుకున్న సిబ్బంది ట్యాంకుకు రంధ్రం చేసి వారిని బయటకు తీశారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. పెన్సిల్వేనియాలోని M&M మార్స్ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఆ ట్యాంకులో ఎలా పడ్డారనే విషయం తెలియరాలేదు.

Exit mobile version