క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘U’ సర్టిఫికెట్ ఇచ్చింది. మార్చి 22న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, షాయరీ సినిమాపై అంచనాలను పెంచాయి. ప్రీమియర్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.