డిగ్రీ అంటే ఇన్నేళ్లు మూడేళ్ల కోర్సు ఉండేది. కానీ ఇప్పుడు ఆ టైంను నాలుగేళ్లకు పెంచుతూ యూజీసీ (యానివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో సెమిస్టర్ 90 రోజుల చొప్పున మొత్తం 8 సెమిస్టర్లు ఉంటాయి. ఈ ప్రతిపాదనకు మార్చి 10న నిర్వహించిన సమావేశంలో యూజీసీ సభ్యులతో పాటుగా, చైర్మన్ కూడా అంగీకారం తెలిపారు. ఈ విధానంలో మూడు సెమిస్టర్లు ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థి మేజర్ మైనర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 7, 8 సెమిస్టర్లలో తాము ఎంచుకున్న ఏదో ఒక సబ్జెక్ట్‌పై రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది.