భారత్లో క్యాంపస్లు విదేశీ యూనివర్సిటీలపై యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యక్ష విధానంలో ఫుల్ టైం కోర్సులు నిర్వహించే విశ్వవిద్యాలయాలకు ఫీజు నిర్ణయించుకునే హక్కును కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్యాంపస్ల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 జాబితాలోని యూనివర్సిటీలకు ఈ అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు విధివిధానలకు సంబంధించిన ముసాయిదాను ప్రకటించింది.