బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం విశ్వాస ఓటింగ్‌లో గెలుపొందారు. జాన్సన్ 211 నుండి 148 ఓట్లతో విజయం సాధించారు. చట్టసభ సభ్యుల్లో అతనికి 59% మద్దతు లభించింది. ప్రధాని సొంత కన్జర్వేటివ్ పార్టీలోని సభ్యులు, ప్రతిపక్షం పార్టీగేట్ కుంభకోణంపై రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఓటింగ్ నిర్వహించారు. 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన జాన్సన్, కరోనా కారణంగా బ్రిటన్లో అమలు చేసిన లాక్‌డౌన్ సహా మద్యం పార్టీ అంశాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.