బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో కెనడా పీఎం జస్టిన్ ట్రూడో, డచ్ PM మార్క్ రూట్లకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ ముగ్గురూ UK సాయుధ దళాల సభ్యులను కలవడానికి రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF) స్థావరాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యన్ దురాగతాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలపాలని కోరారు. అందుకోసం పుతిన్ కు వ్యతిరేకంగా సంకీర్ణాన్ని ఏర్పాటు చేయాలని ఆయా దేశాధినేతలను కోరారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నేతలను ఆహ్వానించారు. దీంతో కెనడా ప్రధాని, డచ్ పీఎం సహా పలువురు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.