రష్యా ఉక్రెయిన్పై జరుపుతున్న దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా చేస్తున్న దాడులకు ఏమాత్రం భయపడకుండా ఉక్రెయిన్ సేనలు దాడులను తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా సైనికులను బందీ చేసుకున్నారు. అయితే ఉక్రెయిన్ సేనలు బందీ చేసిన రష్యా సైనికులను వారి తల్లులు వచ్చి తీసుకోవచ్చని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. తాము పుతిన్లా ఫాసిస్ట్లా వ్యవహరించబోమని, మీ కుమారులను కీవ్ నగరానికి వచ్చి తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉక్రెయిన్ మనుషుల ప్రాణాలు ఎంత విలువైనదో తెలిపే ప్రయత్నం చేసింది.