ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడి పౌరులు వలస వెళ్తున్నారు. దేశం విడిచి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన మాజీ ఎంపీ కోట్విట్స్కీ భార్య 28 మిలియన్ల డాలర్లు, 1.3 మిలియన్ల యూరోలు నిండిన సూట్ కేసులతో దేశాని విడిచి వెళ్లడానికి యత్నించింది. హంగేరి చేరుకోవాలని జకర్పట్టియా మీదుగా బయల్దేరగా అక్కడి గార్డ్స్ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె ఐడియా బెడిసికొట్టింది.