ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం కారణంగా స్వదేశానికి చేరుకున్న భారతీయ వైద్య విద్యార్థులకు ఉపశమనం కలిగే వార్త దక్కింది. విద్యార్థుల భవిష్యత్ నష్టపోకుండా ఉక్రెయిన్లోని చాలా యూనివర్సిటీలు ఆన్లైన్ తరగతులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. డానిలో హాలిట్స్కీ ఎల్వివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఇవానో-ఫ్రాంకివ్స్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, విన్నిట్సియా, బోగో మోలెట్స్ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులను ప్రారంభించాయి. మరికొన్ని విద్యాసంస్థలు ఇదే బాటను అనుసరించాలని భావిస్తున్నాయి.