ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమీర్ జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ లో చేరడానికి ముందు అక్కడి పార్లమెంట్ లో ఉద్వేగంగా ప్రసంగించాడు. ఆయన తన ప్రసంగంలో రష్యన్ సైనికులు 16 మంది చిన్నారులను చంపేశారని, చాలా విధ్వంసం సష్టించారని పేర్కొన్నారు. అయినా కూడా మేము మా హక్కుల కోసం, స్వేచ్చ కోసం పోరాడుతున్నామని తెలిపారు. యూరోపియన్ యూనియన్ లో తమ ప్రజల భాగస్వామ్యం కోసం కూడా పోరాడుతున్నామన్నారు. ఈ మేరకు వర్చువల్ గా యూరోపియన్ పార్లమెంట్ లో పాల్గొన్న జెలెన్స్కీ తన ప్రసంగం మొత్తం ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. దీంతో అక్కడి సభ్యులు చప్పట్లు కొట్టారు.