రష్యాతో పోరాడేందుకు అమెరికా సహాయసాకారాలు అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. అమెరికాలోని కాంగ్రెస్‌ని ఉద్దేశించి వీసీలో ఆయన భావోద్వేగపూరితంగా మాట్లాడారు. అమెరికా శాంతి స్థాపనకు కృషి చేయాలని, రష్యా వల్ల తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌ని ఆదుకోవాలని అభ్యర్థించారు. దీంతో బైడెన్ 800 మిలియన్ల డాలర్ల సాయాన్ని ప్రకటించారు. అలాగే ఆధునికి ఆయుధాలు కూడ అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.