చిన్న దేశమని కూడా చూడకుండా రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలను విధించాయి. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తూనే ఉంది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ప్రపంచంలోని అన్ని దేశాలలో గల ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్లలో రష్యాను నిషేధించాలని కోరారు. రష్యా క్షిపణులు, విమానాలు, హెలికాప్టర్లకు స్కైలైన్లను మూసివేయాలని ఫేస్బుక్ ద్వారా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.