ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని ఆక్రమించుకోవడమే లక్ష్యంగా రష్యా సైన్యం దాడులకు యత్నిస్తుంది. సైనిక స్థావరాలు, జనావాసాలు అనే తేడా లేకుండా క్షిపణులతో విరుచుకుపడుతుంది. అలాగే సమాచార వ్యవస్థను దెబ్బతీసేలా కీవ్‌లోని ప్రధాన టీవీ టవర్స్‌ని రష్యా క్షిపణితో కూల్చివేసింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. రష్యా బలగాలు పెద్ద సంఖ్యలో రాజధాని చుట్టూ మోహరించాయి.