దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా (ICRA) అంచనా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ అంచనాలు ప్రస్తుతం 7.8%గా ఉండగా, వచ్చే నెల మొదటి వారంలో జరగనున్న పాలసీ సమావేశాల్లో దీనిని తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుత వృద్ధి రేటు 5.4% కాగా, వచ్చే త్రైమాసికంలో ఈ రేటు 3-4% మేరకే నమోదయ్యే అవకాశముంది. యుద్ధం నేపథ్యంలో కమోడీటీ ధరలు భారీగా పెరిగాయి. దీంతో వస్తువుల ధరలలో పెరుగుదలతో పాటు ఎకానమీలో అనిశ్చితిని పెరిగింది. పలు కంపెనీల ఉత్పత్తులపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉండటం విశేషం.