రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు స్వదేశానికి రావడానికి నానా అవస్థలు పడుతున్నారు. కేంద్రం ఆపరేషన్ గంగా పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరిహద్దులో ఇంకా చాలామంది బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వడోదరకు చెందిన ఓ విద్యార్థి అక్కడి దయనీయ పరిస్థితి గురించి మీడియాకు వివరించారు. పోలాండ్- ఉక్రెయిన్ సరిహద్దుల్లో పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నాడు. ఉక్రెయిన్ సైనికులు సరిహద్దు దాటి పోలాండ్లోకి అడుగుపెట్టనీయడం లేదని వాపోయాడు. భారతీయులను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకొక్కరు బోర్డర్ దాటాలంటే 3 రోజులు పడుతుందని సదరు విద్యార్థి పేర్కొన్నాడు.