ఉక్రెయిన్పై రష్యా ఈ రోజు యుద్ధాన్ని ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్ అల్లాడిపోతుందని, ఆ దేశంలోని ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని తెలుస్తోంది. కానీ యుద్ధంలో ఉక్రెయిన్ కూడా రష్యాకు ధీటుగానే బదులిస్తోంది. ఇంత వరకు రష్యాకు చెందిన 50 మంది సైనికులను మట్టుబెట్టామని, 6 విమానాలను కూల్చేశామని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. రష్యాకు లొంగేదేలేదని స్పష్టం చేసింది.