రష్యా చేస్తున్న దాడులను చిన్న దేశమైన ఉక్రెయిన్ గట్టిగా ఎదుర్కొటుంది. రష్యా సైనికుల దురాక్రమణను నిలువరించేందుకు ఇప్పటికే ఆ దేశ పౌరులకు ఆయుధాలు కూడా ఇచ్చింది. అయితే తమ దేశం తరఫున పోరాడేందుకు ఉక్రెయిన్ అథ్లెట్లు కూడ ముందుకొచ్చి సైన్యంలో చేరుతున్నారు. రెండు వారాల క్రితం వింటర్ పారా ఒలంపిక్స్‌లో పాల్గొన్న దిమిత్రో పిద్రుచ్నీ, సైన్యంలో చేరాడు. తాజాగా టెన్నిస్ ఆటగాడు సెర్హీ స్టాఖోవ్స్కీ, మాజీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ వెసిల్ లొమచెంకో, మాజీ హెవీ వెయిట్ ప్రపంచ ఛాంపియన్ అలెగ్జాండర్ యుసిక్‌లు ఉక్రెయిన్ సైన్యంలో చేరి దేశ రక్షణకై యుద్ధం చేస్తున్నారు.