తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. చాలా జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొహిర్ లో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. వికారాబాద్ మారేపల్లిలో 9.3, న్యాల్ కల్ సంగారెడ్డి 9.5, రంగారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 10 డిగ్రీలకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీమాడుగులలో 6.48, కుంతాలంలో 7.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించింది.