భారత యంగ్ గన్ ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనత సాధించాడు. తన పదునైన బౌలింగ్‌తో యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంక జరిగిన తొలి టీ20లో 155.3 కి.మీ వేగంతో బంతి విసిరి కెప్టెన్ షనకను పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ తరఫున అత్యంత వేగంగా బంతి విసిరిన బౌలర్‌గా ఉమ్రాన్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు జస్ప్రీత్ బుమ్రా(153.3) పేరిట ఉండేది. కాగా ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.