భారత పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీ20ల కన్నా వన్డేలకు సరిగ్గా నప్పుతాడని టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. అతడి బౌలింగులో వైవిధ్యత లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పాడు. ‘ఉమ్రాన్ మాలిక్ టీ20ల కన్నా వన్డేలకే బాగా సరిపోతాడు. టీ20ల్లో బంతుల్ని వైవిధ్యంగా సంధించాల్సి ఉంటుంది. ఆ నైపుణ్యత ఉమ్రాన్‌కు లేదు. అది మనం అతడు ఐపీఎల్ ఆడుతుంటే గమనించాం. సరైన లైన్, లెంగ్త్ వేయాల్సి వచ్చినప్పుడు ఉమ్రాన్ షార్ట్ బాల్ని వేయలేడు’ అని చెప్పాడు. కాగా, న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఉమ్రాన్ 2 వికెట్లు తీసుకున్నాడు.