పాకిస్తాన్ క్రికెట్ కోచ్ ఆకిబ్ జావెడ్ ఉమ్రాన్ మాలిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ బౌలర్ హరీస్ రౌఫ్‌తో పోలిస్తే ఉమ్రాన్ చాలా వెనకబడి ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. ఉమ్రాన్, హరీస్ రౌఫ్ తీసుకున్నంత ట్రైనింగ్ తీసుకోలేదని, అతడికి రౌఫ్‌కు ఉన్న ఫిట్నెస్ కూడా లేదని అన్నాడు. “వన్డేల్లో ఉమ్రాన్ తొలి ఓవర్లలో 150kph స్పీడ్‌తో బంతులు విసురుతాడు, ఏడో ఓవర్ వచ్చేసరికి 138kphకు అతడి స్పీడ్ పడిపోతుంది” అతడి ఫిట్నెస్ ఇంకా మెరుగవ్వాలని అని ఆకిబ్ జావెద్ అభిప్రాయపడ్డాడు.